బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ఆడాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తుంది. సిరి అయితే కాజల్‌పై పగపట్టి.. ఆమెను ఈవారం నామినేషన్స్ చూడాలని ఉంది.. అంటూ మిగిలిన ఆట ఎలా ఆడాలో రవి, షణ్ముఖ్, శ్రీరామ్, జెస్సీలకు ట్రైనింగ్ ఇచ్చింది. బజర్ మోగిన సమయంలో రవి సంకెళ్లను దక్కించుకోగా, ప్రియాంకను జైలు నుండి తీసుకొచ్చి, షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌ని జైలుకి పంపాడు.
ఇక శ్రీరామ్ సంకెళ్లను దక్కించుకుని కాజల్‌ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్ రవిని సేవ్ చేసి.. సిరిని నామినేట్ చేసి జైలుకి పంపాడు. కాజల్‌ని నామినేషన్స్‌లో పెట్టాలని కుట్ర చేసిన సిరి అనూహ్యంగా శ్రీరామ్ తీసుకున్న నిర్ణయంతో తాను తవ్విన గోతిలో తానే పడింది. ఆ తర్వాత కాజల్‌కు సంకెళ్లు దక్కగా, ఆమె షణ్ముఖ్‌ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చింది.
షణ్ముఖ్.. రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా..చివరకి కెప్టెన్‌గా అనీ మాస్టర్ని మరో కంటెస్టెంట్‌ని నామినేషన్లోకి పంపాలని చెప్పారు. దీంతో అందరు ఊహించినట్టు అనీ కాజల్‌ని నామినేట్ చేసింది. దీంతో ఈ వారం మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు.