Rana Daggubati | టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెరకెక్కిన ఈ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సిరీస్ తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. ఈ సిరీస్‌లో వాడిన అభ్యంతరకర భాష, కంటెంట్‌పై నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తాయని తెలిసిందే. అయితే మిగిలిన పార్టుకు మాత్రం మంచి స్పందన వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అబ్బాయి, బాబాయి తండ్రీ కొడుకులు నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు రానా నాయుడు సీజన్ 2తో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రానా నాయుడు సీజన్ 2 గ్లింప్స్‌లో బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు.. అని చెబుతూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
తాజాగా సీజన్ 2పై రానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేం నిజానికి ప్రేక్షకులను ముందస్తుగానే సిద్దం చేశాం. రానానాయుడు షోలను కుటుంబంతో కలిసి చూడొద్దని చెప్పాం. కానీ ఎవరూ మా మాట వినలేదు. రానానాయుడు వేధింపులకు గురయ్యే యువకుల గురించి ఉంటుంది. ఇది బాధాకరమైన స్టోరీ. ఈ విషయాన్ని బలంగా చెప్పినప్పుడు మాత్రమే షోను చూస్తారన్నాడు.
ఈ షోతో మేము కొన్ని సరిహద్దులు, కట్టుబాట్లను తొలగించాం. మేము సీజన్ 2 షూటింగ్ పూర్తి చేశాం. ఈ సారి గత ఇన్స్టాల్ మెంట్ కంటే కంటెంట్, భాష మెరుగ్గా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ కామెంట్స్‌తో రానా నాయుడు సీజన్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
రానానాయుడు సీజన్ 2 గ్లింప్స్ వీడియో..
Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH
— Netflix India (@NetflixIndia) April 19, 2023
Mr Bachchan | మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాడు.. రవితేజ మూవీ టీవీల్లోనైనా ఇంప్రెస్ చేసేనా..?
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది