Premante Idera | వెంకటేశ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో టాప్‌లో ఉంటుంది ప్రేమంటే ఇదేరా (Premante Idera). జయంత్ సీ పరాన్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రీతి జింటాకు ప్రేమంటే ఇదేరా ఎంట్రీతోనే తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టింది. సాధారణంగా సినిమా నటీనటుల ఎంపిక విషయంలో మొదట ఒకరు అనుకుంటే తర్వాత ఇంకొకరు ఫైనల్ అవుతుంటారు.
ఈ మూవీ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ చాలా కాలం తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. మొదట ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్గా అనుకున్నాడట. అంతేకాదు లవ్ స్టోరీకి ఇంప్రెస్ అయిన ఐశ్వర్యారాయ్.. డేట్స్ కూడా ఇచ్చేసిందట. అయితే చివరి నిమిషంలో చోటుచేసుకున్న ఊహించని పరిణామాలతో ఈ కాంబో తెరరూపం దాల్చలేదన్నాడు జయంత్.
హీరోయిన్ రోల్ కోసం టీమ్ మెంబర్స్ అమిషా పటేల్, రైమా సేన్‌ను కూడా ఆడిషన్స్ చేసినట్టు చెప్పాడు. కానీ ఫైనల్‌గా ప్రీతి జింటా ఆడిషన్స్‌లో ఇంప్రెస్ చేయడంతో వెంకీతో కలిసి నటించే ఛాన్స్ ఆ భామకే ఇచ్చామని.. అలా ప్రతీ జింటా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందని చెప్పాడు జయంత్ సీ పరాన్జీ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో