Sivakarthikeyan | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందిన యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇటీవలే పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు . సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. సినిమాలో వినోదం మిస్సయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
శివకార్తికేయన్ ఓ విషయంలో చాలా నిరాశ చెందుతున్నట్టు చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ఒక్క డైరెక్టర్ కూడా కామెడీ స్కిప్టులతో తన దగ్గరకు రావడం లేదన్నాడు. ఈ రోజుల్లో నా దగ్గరకు కామెడీ స్క్రిప్టులు రావడం లేదు. ప్రతీ ఒక్కరూ నన్ను కామెడీ సినిమాలు ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. కానీ ఒక్క డైరెక్టర్ కూడా సరైన కామెడీ స్క్రిప్ట్‌ను తన వద్దకు తీసుకురావడం లేదని అన్నాడు. దీనికి బడ్జెట్‌తోపాటు చాలా కారణాలు ఉంటాయి. కానీ నెక్ట్స్ సినిమా మాత్రం పక్కా ఎంటర్టైనర్గా వినోదాన్ని అందిస్తుందన్నాడు శివకార్తికేయన్.
పరాశక్తి, అమరన్ నాలోని విభిన్న కోణాలను చూపించాయి. అయినప్పటికీ కామెడీ ఎంటర్టైనర్లను చేయడాన్ని మిస్ అవుతున్నా. దురదృష్ణవశాత్తు ఎవరూ కూడా నాకు పూర్తిస్థాయి కామెడీ స్క్రిప్ట్‌ను వినిపించలేదని చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్. ఓ వైపు కామెడీ కథలు రావడం లేదని చెబుతూనే.. మరోవైపు తాను అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు రెడీగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పుడీ కామెంట్స్ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.
Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!