పవన్ కళ్యాణ్ దర్శకుడికి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
ఐకాన్ | ఐకాన్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది.. వేణు శ్రీరామ్ అది చేస్తాడు అని చెప్పాడు దిల్ రాజు. కానీ అందులో హీరో అల్లు అర్జున్ అని మాత్రం కన్ఫామ్ చేయలేదు.

ఈ రోజుల్లో ఒక సినిమా కమిట్ అయిన తర్వాత అది సెట్స్ పైకి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఆదిలోనే ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా.. మరికొన్ని సినిమాలు అనివార్య కారణాలతో ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి అల్లు అర్జున్ ఐకాన్ సినిమా కూడా చేరిపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు రెండేళ్ల కింద అనౌన్స్ చేశాడు. అప్పటికే నాని ఎంసీఏ సినిమా విజయంతో మంచి దూకుడు మీద ఉన్నాడు వేణు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా అవకాశం కూడా ఆయనకు వచ్చింది.పింక్ సినిమాను తెలుగులో అభిమానులకు నచ్చేలా రీమేక్ చేసి మంచి మార్కులు వేయించుకున్నాడు వేణు శ్రీరామ్. దాంతో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ఖచ్చితంగా తెరకెక్కుతోందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇది జరిగేలా లేదు. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ మధ్య ప్రెస్ మీట్లో ఐకాన్ సినిమా గురించి చెప్పిన దిల్ రాజు.. అందులో అల్లు అర్జున్ గురించి చెప్పలేదు. కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు.ఐకాన్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది.. వేణు శ్రీరామ్ అది చేస్తాడు అని చెప్పాడు దిల్ రాజు. కానీ అందులో హీరో అల్లు అర్జున్ అని మాత్రం కన్ఫామ్ చేయలేదు. పైగా ఐకాన్ స్టార్ అని బిరుదు తాము ఇవ్వలేదని.. ఆయనే పెట్టుకున్నాడు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తుంది. దానికి తోడు క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమా నుంచి బన్నీ తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకే ఐకాన్ కథ కోసం మరో హీరోను వెతుక్కుంటున్నాడు వేణు శ్రీరామ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Dil raju
- Icon
- icon star
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

