అలా మొదలైంది సినిమాతో తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది నిత్యమీనన్ (Nithya Menen). ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ బ్యూటీ ఇటీవలే పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) హీరోగా నటించిన భీమ్లానాయక్‌తో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. భీమ్లానాయక్ ( Bheemla Nayak)సతీమణిగా నిత్యమీనన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యమీనన్ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసింది.
నిత్య అన్ ఫిల్టర్డ్ (Nithya Unfiltered) పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినట్టు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది నిత్యమీనన్. సినిమా ప్రపంచంలో తన 12 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన విషయాలను తొలి వీడియోగా షేర్ చేసింది. తన వ్యక్తిగత,వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయని తెలిపింది నిత్యమీనన్. తక్కువ సమయంలో ఈ ఛానల్‌కు వేల మంది ఫాలోవర్లు చేరిపోవడం విశేషం. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి అని చెబుతోందీ బ్యూటీ.
నిత్యమీనన్ ప్రస్తుతం ఓటీటీ సింగింగ్ కాంపిటీషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol)కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ షో. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తుండగా..షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా కియారా తాజా పోస్ట్