Robin Hood | నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంపన్నులను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తుంటాడు రాబిన్‌హుడ్. అదే సమయంలో అవసరం ఉన్నవారికి సహాయం చేస్తుంటాడు.
డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న రాబిన్‌హుడ్ చేసిన అడ్వెంచరస్ జర్నీ ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని దర్శకుడు తెలిపారు. వినోదం, యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, రాబిన్‌హుడ్‌గా నితిన్ పాత్ర కొత్త పంథాలో సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.