టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాంబినేషన్‌గా నిలిచారు హీరో నితిన్ (Nithiin), యువ దర్శకుడు వెంకీకుడుముల (Venky Kudumula), రష్మిక మందన్నా. ఈ ముగ్గురి కలయికలో తాజాగా VNRTrio (వర్కింగ్ టైటిల్) సినిమా వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి (Nithiin) చేతుల మీదుగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. VNRTrio పూజాకార్యక్రమాలతో ప్రారంభం కాగా.. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి (chiranjeevi) క్లాప్ కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవితో సినిమా చేయాలని వెంకీ కుడుముల చాలా ఏండ్లుగా నిరీక్షిస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవిని ఇంప్రెస్ చేసే సరైన స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో వెంకీ, చిరుల కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పైకి రావడం ఆలస్యమవుతూ వస్తోంది.
వెంకీ కుడుముల, చిరు కాంబినేషన్లో సినిమా ఇక కష్టమేనా..? అని మూవీ లవర్స్ ఆలోచిస్తున్న నేపథ్యంలో నితిన్ సినిమా లాంఛింగ్‌కు చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడం హాట్ టాపిక్‌గా మారింది. వెంకీ కుడుముల కోరిక మేరకే చిరంజీవి ఈవెంట్‌కు వచ్చి ఉంటాడని, భవిష్యత్‌లో వెంకీ, చిరు సినిమా రావడం పక్కా అని చర్చించుకున్నారు సినీ జనాలు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Vnrtrio1
VNRTrio మూవీ లాంఛ్..
Few candid moments from #VNRTrio opening ceremony 🤩
Mega⭐ @KChiruTweets Garu Graced the Pooja Ceremony ✨@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/RXHc4dezHZ
— YouWe Media (@MediaYouwe) March 24, 2023
Ponniyin Selvan 2 | విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా మారాడిలా.. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ అప్డేట్
Pawan Kalyan | ఏప్రిల్‌లో ఫుల్ బిజీగా పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ లో జోష్