Pawan Kalyan | ఏప్రిల్‌లో ఫుల్ బిజీగా పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ లో జోష్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు నిరాశ కలిగించకుండా ఉండేందుకు తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ ప్లాన్‌తో బిజీ షెడ్యూల్ రెడీ చేసుకున్నాడు. ఏప్రిల్‌లో ఫుల్ బిజీ కానున్నాడు పవన్ కల్యాణ్ .
ఓ వైపు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే.. మరోవైపు అభిమానుల కోసం సినిమాలు కూడా చేస్తూ ముందుకెళ్తున్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అభిమానులకు నిరాశ కలిగించకుండా ఉండేందుకు తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ ప్లాన్‌తో బిజీ షెడ్యూల్ రెడీ చేసుకున్నాడు పవన్ కల్యాణ్. ఈ స్టార్ హీరో చేతిలో వినోధయ సీతమ్ రీమేక్, హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ (OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ప్రాజెక్టులున్నాయి.
కాగా పవన్ కల్యాణ్ ఏప్రిల్‌లో ఫుల్ బిజీ కానున్నాడు. ఫిలింనగర్ సర్కిల్ టాక్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం 10 రోజులు డేట్స్ ఇచ్చాడు. అంతేకాదు మరోవైపు సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న ఓజీ షూటింగ్ కూడా వచ్చే నెలలోనే షురూ చేయబోతున్నాడట. ఇప్పటికే సముద్రఖని డైరెక్షన్లో నటిస్తున్న వినోదయ సీతమ్ షూటింగ్ దశలో ఉంది. ఈ లెక్కన పవన్ కల్యాణ్ ఏప్రిల్‌లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడన్న మాట. ఈ వార్తను ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో టైటిల్ రోల్ పోషిస్తున్న హరిహరవీరమల్లు అప్డేట్పై పవన్ కల్యాణ్ కాంపౌండ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా నెలల క్రితం మొదలవగా.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రిలీజైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
Read Also :
Ponniyin Selvan 2 | విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా మారాడిలా.. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

