Dhoom Dhaam Dhosthaan | ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్‌కు రవితేజ, నాని కలిసి డ్యాన్స్ చేస్తే.. ట్రెండింగ్‌లో వీడియో
టాలీవుడ్ హీరోలు రవితేజ (Ravi Teja), నాని త్వరలోనే వినోదాన్ని పంచేందుకు సిద్దమవున్నారు. దసరా సూపర్ హిట్ ట్రాక్ ధూమ్ ధామ్ దోస్తాన్ (Dhoom Dhaam Dhosthaan) పాటకు రవితేజ, నానిస్టెప్పులేశారు.
ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు మాత్రం పండుగే. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలెవరనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్న టాలీవుడ్ హీరోలు రవితేజ (Ravi Teja), నాని. రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్ 7న విడుదలవుతుండగా.. నాని (Nani) నటిస్తోన్న దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరూ చిట్ చాట్ సెషన్లో పాల్గొన్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతూ.. అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
అయితే చిట్‌చాట్ టైంలో రవితేజ, నాని దసరా సూపర్ హిట్ ట్రాక్ ధూమ్ ధామ్ దోస్తాన్ (Dhoom Dhaam Dhosthaan) పాటకు స్టెప్పులేశారు. కుర్చీలపైనే కూర్చొని ఎవరి స్టైల్లో వాళ్లు ఈ పాటకు స్టైలిష్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.ఒకేసారి రెండు సినిమాల ప్రమోషన్స్ చేసుకుంటూ తమ నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు ఇలా సరికొత్తగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారంటున్నారు సినీ జనాలు.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రావణాసురలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
రవితేజ, నాని డ్యాన్స్ చేస్తే..
Bhai se miloge tho ek step toh bantha hai 🔥@RaviTeja_offl 🤍#Dasara #Ravanasura #DhoomDhaam pic.twitter.com/OFNrXsTgdX
— Nani (@NameisNani) March 23, 2023
రావణాసుర గ్లింప్స్ వీడియో..
దసరా ట్రైలర్..
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
రావణాసుర టీజర్..
Read Also :
Ajith father | స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Ponniyin Selvan 2 | విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా మారాడిలా.. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ అప్డేట్
Pawan Kalyan | ఏప్రిల్‌లో ఫుల్ బిజీగా పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ లో జోష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

