గత కొంతకాలంగా సరైన విజయాలు లేక నిరుత్సాహంలో ఉన్నారు హీరో నితిన్. గత ఏడాది విడుదలైన ‘తమ్ముడు’ కూడా పరాజయంపాలైంది. వరుస ఫెయిల్యూర్స్‌తో సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నితిన్.. ఇటీవలే మూడు సినిమాలకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అందులో ఓ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని తెరకెక్కించబోతున్నారు.
‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తాడు. ‘దండోరా’ తరహాలోనే తెలంగాణ నేపథ్యంలో సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగే సినిమా ఇదని సమాచారం. ఇందులో నితిన్‌కు జోడీగా రుక్మిణి వసంత్ నటించబోతున్నది. గ్లామర్ హంగులకు దూరంగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఆమె పాత్ర సాగుతుందని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఆగస్ట్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.