నితేష్ తివారి ‘రామాయణం’ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే నితేష్ ఓ కీలక షెడ్యూల్‌ని పూర్తి చేశారు. శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్‌కపూర్, రావణ పాత్ర పోషిస్తున్న యష్‌లపై ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ వచ్చేవారం నుంచి ముంబైలోనే మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో యష్‌తో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొనగా, భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్‌సింగ్, లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పానిండియా సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. తొలి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి, మలి భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.