సౌమిత్‌రావు, శ్రేయాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘నిలవే’. వీఓవీ ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకులు. శుక్రవారం ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేశారు. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ వివిధ రకాల భావోద్వేగాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సౌమిత్‌రావు మాట్లాడుతూ ‘అంతా కొత్తవాళ్లతో సినిమా తీశాం.
మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి’ అన్నారు. ఓ వ్యక్తి జీవిత ప్రయాణానికి అద్దం పడుతూ సాగే చిత్రమిదని, కథలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుల్లో ఒకరైన సాయి వెన్నం తెలిపారు. కథాగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు కల్యాణ్ నాయర్ పేర్కొన్నారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాడి.