టాలీవుడ్ (Tollywood) యువ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు 18 పేజెస్ (18 Pages). పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కొత్త అప్డేట్ను మేకర్స్ అందించారు. 18 పేజెస్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
త్వరలోనే రిలీజ్ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసుతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. కొత్తదనంతో కూడిన కథలతో ఆడియెన్స్ ను పలుకరించే నిఖిల్ ఈ సారి ఎలాప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.
అనుపమ పరమేశ్వరన్ నందిని అనే యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా