కమిటీ కుర్రాళ్ల హంగామా
ఓ వైపు నటన, మరో వైపు చిత్ర నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉంటున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో యదు వంశీ దర్శకుడిగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే పేరును ఖరారు చేశారు.
ఓ వైపు నటన, మరో వైపు చిత్ర నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉంటున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో యదు వంశీ దర్శకుడిగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే పేరును ఖరారు చేశారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఋశ్వర్ రాచిరాజు, త్రినాథ్‌వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, రఘునందన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్విరావు, టీన శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి ప్రధాన పాత్రధారులు.
ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని హీరో సాయిదుర్గతేజ్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయడం బాధ్యతగా భావిస్తున్నాను. ‘కమిటీ కుర్రాళ్లు’ అనే టైటిల్ ఈ కథకు యాప్ట్. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని నిహారిక నమ్మకం వెలిబుచ్చారు.
చిత్రీకరణ పూర్తయిందని, ఇందులో 11మంది హీరోలను, 4 హీరోయిన్లను పరిచయం చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తామని, విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

