Niharika Konidela | కమిటీ కుర్రోళ్లు.. ఊరిలో జాతర చూసినట్లుంది: నిహారిక కొణిదెల
‘ఈ కథ వినగానే తప్పకుండా సినిమా తీయాలని ఫిక్సైపోయా. అంత బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నాకు పల్లెటూళ్లలో జరిగే జాతరలు ఎలా ఉంటాయో తెలియవు.
Niharika Konidela | ‘ఈ కథ వినగానే తప్పకుండా సినిమా తీయాలని ఫిక్సైపోయా. అంత బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నాకు పల్లెటూళ్లలో జరిగే జాతరలు ఎలా ఉంటాయో తెలియవు. కానీ దర్శకుడు యదువంశీ జాతర శోభను కళ్లకుకట్టినట్లుగా చూపించాడు’ అని చెప్పింది నిహారిక కొణిదెల. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై నూతన తారాగణంతో ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం నిహారిక కొణిదెల పాత్రికేయులతో
పంచుకున్న విశేషాలు..
- పన్నెండేళ్లకు ఓసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథ నడుస్తుంది. మూడు తరాలను ఆవిష్కరించే ఈ కథలో హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. పదకొండు మంది అబ్బాయిలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. ప్రేక్షకులు వారి క్యారెక్టర్స్‌తో పర్సనల్‌గా కనెక్ట్ అవుతారు. వారితో కలిసి ప్రయాణం చేస్తారు.
- మా నాన్న ఏదైనా కథ విని నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ ఈ కథ విని ఆయన చాలా బాగుందని అన్నారు. అన్నావదినలకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. అన్నయ్య వరుణ్‌తేజ్ స్ట్రెయిట్ ఫార్మార్డ్గా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. ఈ సినిమా చూసి నన్ను అభినందించారు. సెన్సార్ వాళ్లకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది.
- ఊళ్లలో పండగలు, జాతరలు, గొడవలు.. ఇలా ఏ విషయమైనా కుర్రాళ్లే ముందుంటారని దర్శకుడు వంశీ చెప్పారు. అందుకే ఆ టైటిల్‌ను పెట్టారు. అనుదీప్ ఇచ్చిన సంగీతం ఈ కథకు ప్రాణం పోసింది. ఇక నటనాపరంగా మంచి కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యతనిస్తా. మిగతా అంశాల గురించి పెద్దగా పట్టించుకోను. చిన్న పాత్ర, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ నచ్చితే నటిస్తా. కేవలం వారసత్వంతో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరు. ప్రతిభతో పాటు సినిమా అంటే ప్రేమ, కష్టపడే తత్వం ఉండాలి. అప్పుడే విజయాలు దక్కుతాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

