Rashmika Mandanna | భాషలకు అతీతంగా ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ.. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంటూ.. సూపర్‌స్టార్‌గా అవతరించింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. అల్లు అర్జున్ ‘పుష్ప2’, ధనుష్ ‘కుబేర’లతోపాటు బాలీవుడ్లో రెండు క్రేజీ సినిమాలకు కమిట్ అయ్యింది రష్మిక. ఎంత బిజీగా ఉన్నా మంచి అవకాశం వస్తే మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేసుకొనైనా ఆ సినిమా చేసేయడం రష్మిక ైస్టెల్.
అందుకే ఆమె దగ్గరకి వచ్చిన మంచి పాత్రలు వెనక్కి వెళ్లవ్. రీసెంట్గా అలాంటి మరో మంచి అవకాశమే నేషనల్ క్రష్‌ని పలకరించింది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రష్మిక. ఇది రష్మిక మాత్రమే చేయగలిగిన పాత్ర అని, అందుకే ఆమెను కలిశామని దర్శకుడు శిబిచక్రవర్తి చెబుతున్నారు. హిట్ సినిమాల్లో నటించడం, గొప్ప పాత్రలతో మెప్పించడం అందరికీ సాధ్యంకాదు. అందుకే రష్మిక లక్కీ.