బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘బెల్‌బాటమ్’. రంజిత్ ఎం తివారీ డైరెక్షన్లో స్పై థ్రిల్లర్ గా వస్తోన్న బెల్ బాటమ్ ట్రైలర్ ( BellBottom trailer) నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలో విశ్వ సుందరి, సినీ నటి లారా దత్తా ప్రధాన పాత్రలో పోషిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా లారా నటిస్తున్న విషయాన్ని సినీ ప్రియులతో పాటు నెటిజన్లు గుర్తు పట్టేశారు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రోల్లో నటించడం గొప్ప విషయమన్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా పొందడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మాదిరిగానే ఏ మాత్రం తేడా లేకుండా మేకప్ చేసిన ఆ ఆర్టిస్టుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇందిరాగాంధీ వేషధారణలో ఉన్న లారాదత్తాను గుర్తు పట్టడం కష్టంగా ఉంది. ఆ లెవల్లో మేకప్ చేసిన ఆర్టిస్టుకు తప్పకుండా అవార్డు ఇవ్వాలన్నారు. ఆ ఆర్టిస్టుకు ముందుగానే జాతీయ అవార్డు ప్రకటించాలన్నారు. 1984లో ఇండియాలో జరిగిన విమానాల హైజాక్స్ ఘటనల నేపథ్యంలో సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపిస్తున్నాడు. ఇండియాలో వరుస హైజాకింగ్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు మొట్టమొదటి కోవర్ట్ ఆపరేషన్ చేపట్టిన ‘రా’ ఏజెంట్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. పూజా ఎంటర్టైన్మెంట్స్, ఎమ్మా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్, హ్యుమాఖురేషి కీ రోల్స్ పోషిస్తున్నారు. ఆగస్టు 19న విడుదల కానుందీ చిత్రం.
OMG this is #LaraDutta our Miss Universe😱😮.. she nailed it.. looking forward for this movie..
— Aishwarya Muraleedharan (@Aishwar46954977) August 3, 2021
#BellBottomTrailer pic.twitter.com/56xyul28d6
OMG 😳 is she #LaraDutta ?? unrecognizable… next level makeup.. the makeup artist deserves an award for this outstanding work.. pic.twitter.com/iuE32y5E50
— ⟦🅰️⟧ (@ohnadaanparinde) August 3, 2021
Give this makeup artist a national
— 🄰🄳🄳🅄 🇮🇳 (@Addu86842053) August 3, 2021
award in advance..
Phenomenal work 🙏🏻🙏🏻🔥🔥#BellBottomTrailer #LaraDutta pic.twitter.com/WRFFF5N9Fz