Netflix | ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వినోదాన్నిఅందించేందుకు రెడీ అవుతోంది పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్. ఒకే వారంలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలను విడుదల చేస్తూ ఓటీటీ లవర్స్‌కు పసందైన వినోదాన్నిఅందించనుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ వారం ముగ్గురు స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేస్తుంది. వీటిలో ఒకటి సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా కాంబోలో వచ్చిన చిత్రం సికందర్. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అదేవిధంగా నాని హీరోగా నటించిన ప్రాంఛైజీ ప్రాజెక్ట్ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 29న తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ మూవీ మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెట్రో తెలుగు, తమిళంలో పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడనివారు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చన్నమాట.
ఇంకేంటి వారంలోనే మూవీ లవర్స్‌కు పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్ మెంట్ ఉండబోతుందన్నమాట. హిట్ 3 మినహా రెట్రో, సికిందర్ థియేటర్లలోఇంప్రెస్ చేయలేకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ మెంట్ పక్కా అని మూడు సినిమాలతో నెట్ ఫ్లిక్స్ చెప్పకనే చెబుతోంది.
లైనప్‌లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు..
He’s Arjun for the loved ones and Sarkaar for the criminals 😎
Watch HIT: The Third Case, out 29 May, on Netflix in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada.#HitTheThirdCaseOnNetflix pic.twitter.com/OP3VM8ohDP— Netflix India (@NetflixIndia) May 24, 2025
A sacred spear. A secret identity. A saga for the ages. 🔥
Watch Retro, out 31 May, on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam. #RetroOnNetflix pic.twitter.com/NvFBLFiNlR— Netflix India (@NetflixIndia) May 26, 2025
Ab hoga dhamaka on every level 👊💥 Kyunki Netflix par aa gaya hai Sikandar ❤️🔥
Watch Sikandar, out now on Netflix. #SikandarOnNetflix pic.twitter.com/Sdo61HaD8R— Netflix India (@NetflixIndia) May 25, 2025