OTT | ప్రతి వారం ప్రేక్షకులని అలరించేందుకు థియేటర్స్‌తో పాటు ఓటీటీలలో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్స్‌లో చూస్తే మే 30న భైరవం చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన షష్టిపూర్తి కూడా మే 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఈ వారం కూడా వివిధ ఓటీటీల్లో 19 సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యాయి. ఇందులో హారర్, క్రైమ్, ధ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్, కామెడీ కంటెంట్ కలిగిన చిత్రాలు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ఆహా జీ5, హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో.. చూస్తే.. మే 23న ఫర్గెట్ యూ నాట్ ఇంగ్లీష్ కామెడీ వెబ్‌సిరీస్, మే 23 ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ ఇంగ్లీష్ హరర్ ధ్రిల్లర్ సినిమా, మే 23 ఎయిర్ ఫోర్స్ ఎలైట్ ఇంగ్లీషు సినిమా, మే 23 బిగ్ మౌత్ సీజన్ 8 ఇంగ్లీషు వెబ్‌సిరీస్, మే 23 ఆఫ్ ట్రాక్ 2 స్వీడిష్ సినిమా, మే23 అన్ టోల్డ్ ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ ఇంగ్లీష్ సినిమా, మే 24 ద వైల్డ్ రోబో తెలుగు డబ్బింగ్ ఇంగ్లీషు సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి. మే 29 నుండి హిట్ 3 స్ట్రీమ్ కానుంది. మే 31వ తేది నుండి రెట్రో సినిమా స్ట్రీమ్ కానుంది. మే 25 నుండి సికిందర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆహాలో.. మే 23 అర్జున్ సన్నాఫ్ వైజయంతి తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా, మే 23 వల్లమై తమిళ క్రైమ్ సినిమా స్ట్రీమ్ అవుతుంది.
జియో హాట్‌స్టార్‌లో.. మే 23 ఫైండ్ ద ఫర్జీ హిందీ గేమ్ షో, మే 24 పీవీ యూజ్ హిమ్ సెల్ఫ్ అెమెరికన్ వెబ్‌సిరీస్, మే 23 ఫౌంటెన్ ఆఫ్ యూత్ అమెరికన్ ధ్రిల్లర్ సినిమా స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో..మే 23 సారంగపాణి జాతకం తెలుగు కామెడీ సినిమా స్ట్రీమ్ అవుతుండగా, మే 3 అభిలాషం మలయాళం రొమాంటిక్ సినిమా సినిమా స్ట్రీమ్ కానుంది. మొత్తానికి ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ సికందర్, నాని హిట్ 3, క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లాంటి ఆసక్తికర చిత్రాలు ఉన్నాయి.