Hari Hara Veera Mallu | పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి జూన్ 12వ తేదీన ‘హరి హర వీరమల్లు థియేటర్లలోకి వస్తుంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ చిత్రంకి సంబంధించిన పలు పోస్టర్స్, వీడియోస్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రం నుండి రిలీజ్ అయిన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, పవర్ ఫుల్ ‘అసుర హననం’ సాంగ్స్ ఎంత ట్రెండ్ అయ్యోయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ రిలీజ్‌కి టైం ఫిక్స్ చేశారు.
మే 28న ఉదయం 10:20 గంటలకు ‘తార తార’ పాట రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ది సిజ్లింగ్ సింగిల్.. హరిహర వీరమల్లు నుంచి ఈ ఏడాది అత్యంత హాటెస్ట్ ట్రాక్ వినడానికి రెడీగా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్, ‘డాకు మహారాజ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాబి డియోల్ సైతం ఇందులో కీలక పాత్రలో కనిపించి మెప్పించనున్నారు. ఔరంగజేబు పాత్రలో ఆయన కనిపించనున్నట్టు తెలుస్తుంది.
ఇక హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం కాగా, అందులోనూ దొరలను దోచి పేదలకు న్యాయం చేసే రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ చేస్తూ ఉండడంతో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సౌత్, నార్త్‌లలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో చేసే ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్ తప్పకుండా హాజరు అవుతారని తెలుస్తుంది.