Actor Prabhas | ప్రభాస్‌ను కలుసుకున్న నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో.. సరాండొస్ ఏం ప్లాన్ చేస్తున్నావు.?
Ted Sarandos | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్లో పాగా వేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో టెడ్ సరాండొస్ (Ted Sarandos) గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Ted Sarandos | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్లో పాగా వేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో టెడ్ సరాండొస్ (Ted Sarandos) గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సరాండొస్ వచ్చిన దగ్గరనుంచి టాలీవుడ్ సినీ ప్రముఖులను వరుసగా కలుస్తున్నాడు. మొదటిరోజు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నివాసానికి వచ్చిన సరాండోస్ రామ్ చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నిర్మాత శోభు యార్లగడ్డలను కలిసి ముచ్చటించారు. అనంతరం ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న అల్లు అర్జున్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్ తదితరులను నెట్ ఫ్లిక్స్ సీఈవో కలుసుకున్నాడు.
అనంతరం రెండో రోజు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కుటుంబంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్‌లను కలుసుకున్నాడు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్‌తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, అన్న కల్యాణ్ రామ్, దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివను సరాండొస్ కలుసుకున్నాడు. అనంతరం గుంటూరు కారం సెట్‌కి నేరుగా వెళ్లిన టెడ్ సరాండొస్ అక్కడ మహేష్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలుసుకున్నాడు. అయితే ఈ మీటింగ్ అనంతరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను టెడ్ కలుసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ షూటింగ్ సెట్‌కి వెళ్లిన సరాండొస్ ప్రభాస్‌తో పాటు చిత్రయూనిట్‌తో ముచ్చటించాడు. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
It was a privilege to host #TedSarandos, the CEO of Netflix and his talented team #MonikaShergill #AbhishekGoradia on the sets of #Kalki2898AD.
The evening was filled with insightful conversations about the power of storytelling and the exciting future of entertainment.@netflix… pic.twitter.com/5wktOxVTEd
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 9, 2023
అయితే టెడ్ సరాండొస్ టాలీవుడ్ సెలెబ్రిటీలను కలవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్ సినీ దిగ్గజాలతో వెబ్ సిరీస్ లేదా ఒరిజినల్స్ ఏమైనా ప్లాన్ చేస్తుందా అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అయితే టాలీవుడే కాకుండా సౌత్‌లోని అన్ని భాషలలో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ పర్యటనపై టెడ్ సరాండొస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తెలుగు సినిమా దిగ్గజాలను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలపై వారికి ఉన్న అంకితభావానికి నేను ఆశ్చర్యపోయాను. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించారు. త్వరలోనే మళ్లీ కలుస్తాను అంటూ రాసుకోచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

