VarunLav | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్-లావణ్య (Varun Tej – Lavanya Tripathi) మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ వేడుకకు మెగా, అల్లు, త్రిపాఠి కుటుంబ సభ్యులు, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.ఈ రిసెప్షన్‌కు ఇండస్ట్రీ మొత్తం కదలి వచ్చి కొత్త జంటను ఆశీర్వదించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘వరుణ్‌లావ్’ (VarunLav) హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇటలీలో జరిగిన వరుణ్‌లావ్ పెళ్లికి సంబంధించిన వీడియోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT platforms) నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుందట. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరి పెళ్లి వీడియో హక్కుల కోసం ఏకంగా రూ.8 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, మెగా అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రూ.8కోట్లు అంటే.. పెళ్లికి పెట్టిన ఖర్చు మొత్తం తిరిగి వచ్చేసినట్లే అంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి వీడియోని ప్రసారం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.20కోట్లకు డీల్ కుదుర్చుకుంది. అయితే, నిబంధనలను పాటించని కారణంగా ఆ కాంట్రాక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంది.
Also Read..
Diwali Party | దీపావళి పార్టీ.. ఒకే ఫ్రేమ్‌లో చరణ్, మహేశ్ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. కేంద్ర ఐటీ విభాగం ఏమందంటే..?