Nenu Meeku Telusa Director | తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ దర్శకుడు ‘నేను మీకు తెలుసా?’ ఫేమ్ అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన చనిపోయనట్లు సమాచారం. అజయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక అజయ్ మృతి తనను ఎంతో కలిచివేసిందని హీరో మంచు మనోజ్ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
”నా ప్రాణ స్నేహితుడు నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి ఇక లేరనే వార్త తనను ఎంతో కలిచివేసింది. మాటల్లో వర్ణించలేనంత బాధగా ఉంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు ధైర్యాన్నివాలని శివుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి. చాలా త్వరగా వెళ్లిపోయావ్ అజయ్.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది కల అయితే బాగుండు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా” అంటూ మనోజ్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
అజయ్ శాస్త్రి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన చిత్రం నేను మీకు తెలుసా. స్నేహ ఉల్లాల్ కథానాయికగా నటించింది. సైకాలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మనోజ్ కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకు కల్కితో బ్లాక్ బస్టర్ అందుకున్నా నాగ్ అశ్విన్ అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేశాడు.
Heartbreaking to inform that my best friend and the Captain of Nenu Meeku Telusa is no more. No words can describe the pain we r enduring. Praying lord shiva to give strength to his family and loved ones. Om Shanti.
Will miss you ra Ajay, gone too soon. Wishing this is a dream.… pic.twitter.com/zxjPjdi2Tw— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 2, 2024
Also Read..
Wayanad Tragedy | వయనాద్‌లో వందకు పైగా ఇండ్లు నిర్మిస్తాం : బాధితులకు రాహుల్ గాంధీ భరోసా
AP Metro Rail | ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకం
Dog attacks | దారుణం.. ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి