మహబూబాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. బుధవారం రాత్రి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండా (బట్టువానితాళ్లు)లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి ప్రాణం తీసిన ఘటన మరవక ముందే తాజాగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Gadwala) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల హమాలీ కాలనీలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై(Childrens injured) శుక్రవారం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో అస్మిత్ (15 నెలలు) ముఖంపై తీవ్ర గాయాలు కాగా, రితిక్ (4) స్వల్పంగా గాయ పడ్డాడు. గాయపడ్డ ఇద్దరిని వెంటనే గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.