చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో హీరో నటించిన చిత్రం ‘నేను-కీర్తన’. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీకుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు చిమటా రమేశ్‌బాబు, కథానాయిక రిషిత ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
ఇది దర్శకుడిగా, కథానాయకుడిగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, ఇందులో కథానాయికగా నటించిన రిషితకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, రెండున్నర గంటలపాటు నాన్‌స్టాప్‌గా ఎంటర్టైన్ చేసే సినిమా ఇదని చిమటా రమేశ్‌బాబు తెలిపారు. ‘నేను-కీర్తన’ సినిమా హీరోయిన్గా తన కెరీర్‌కి శుభారంభం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నానని కథానాయిక రిషిత చెప్పారు.