ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నేనెక్కడున్నా. మాధవ్ కోదాడ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. మారుతి శ్యాంప్రసాద్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈసినిమా తప్పక అందరికీ నచ్చుతుందని మేకర్స్ ఎలిపారు. జీతం కోసం కాకుండా జనాల జీవితాలకోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్న ఆనంద్, ఝాన్సీల కథ ఇదని, ఈ సినిమాలో వారిద్దరూ చేసే కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ వల్ల కొందరు అవినీతి భాగోతాలు బయటపడతాయని, ఆ తర్వాత తాము ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నారు? అనేది మిగతా కథ.
మురళీశర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తదితరలు నటించిన ఈచిత్రానికి కెమెరా: జయపాన్ నిర్మల, సంగీతం: శేఖర్‌చంద్ర, సమర్పణ: కేవీఆర్ సమర్పణ.