e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News రాజ్‌కుంద్రా కోసం.. 70 పోర్న్ వీడియోలు తీశారు

రాజ్‌కుంద్రా కోసం.. 70 పోర్న్ వీడియోలు తీశారు

రాజ్‌కుంద్రా కోసం.. 70 పోర్న్ వీడియోలు తీశారు

ముంబై : బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం వ‌ర‌కు ఆయ‌న పోలీసు క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని రాజ్‌కుంద్రా అప్పీల్ చేసుకున్నారు. అయితే కుంద్రా ఆదేశాల మేర‌కు చిన్న సంస్థ‌లు 70 పోర్న్ వీడియోల‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. దీని గురించి ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చిన్న త‌ర‌హా నిర్మాణ సంస్థ‌లు ఆ పోర్న్ వీడియోల‌ను షూట్ చేసిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌న్నీ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ నిఘాలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఇత‌ర‌ నిర్మాణ సంస్థ‌ల‌తో పాటు కుంద్రా ఓన‌ర్‌గా ఉన్న హాట్‌షాట్స్ యాప్ కోసం ప్ర‌త్యేకంగా 90 పోర్న్ వీడియోల‌ను రూపొందించారు. వీటిల్లో కొన్ని వీడియోలు 20 నుంచి 30 నిమిషాలు పైగా ఉంటాయ‌ని పోలీసులు వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. పోర్న్ రాకెట్‌ను న‌డిపిస్తున్న కేసులో ఇప్ప‌టికే 11 మందిని అరెస్టు చేశారు. రాజ్‌కుంద్రాపై 420 చీటింగ్‌, 34 కామ‌న్ ఇంటెన్ష‌న్‌, 292, 293 సెక్ష‌న్ల కింద కేసులు బుక్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాజ్‌కుంద్రా కోసం.. 70 పోర్న్ వీడియోలు తీశారు
రాజ్‌కుంద్రా కోసం.. 70 పోర్న్ వీడియోలు తీశారు
రాజ్‌కుంద్రా కోసం.. 70 పోర్న్ వీడియోలు తీశారు

ట్రెండింగ్‌

Advertisement