NBK 109 | టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు బాబీ (Bobby). ఈ లీడింగ్ డైరెక్టర్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో ఎన్బీకే 109 (NBK109) చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఎన్బీకే 109 టైటిల్ అనౌన్స్మెంట్కు ముహూర్తం ఖరారైనందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ టైటిల్‌ను దసరా కానుకగా ప్రకటించబోతున్నారట.
ఈ వార్తపై మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. మాన్స్టర్ వచ్చేశాడు..అని లాంచ్ చేసిన గ్లింప్స్‌లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి, దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ సాగుతున్న సంభాషణలు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్న విజువల్స్ అభిమానులకు పసందైన వినోదం పక్కా అని అర్థమవుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎన్బీకే 109లో ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. కలర్ ఫొటో ఫేం చాందినీ చౌదరి కీ రోల్ పోషిస్తోంది.
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ