Bhagavant Kesari | భగవంత్ కేసరి టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
Bhagavant Kesari | బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాకు భగవత్ కేసరి ( Bhagavant Kesari ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్. ఇందులో బాలయ్య క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని.. సింపుల్‌గా చెప్పాలంటే సీతయ్యలా ఆయన క్యారెక్టర్‌ను అనిల్ డిజైన్ చేశారని తెలుస్తోంది.
Bhagavant Kesari | బాలయ్య ఒక్కడే కాదు.. ఆయన అభిమానులు కూడా ఇప్పుడు మంచి హైలో ఉన్నారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హిట్టు కొడితే మరో హిట్ కొట్టడానికి మూడు నాలుగేళ్లు గ్యాప్ తీసుకునే బాలకృష్ణ.. ఇప్పుడు మాత్రం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అఖండతో 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈయన.. మొన్న వీరసింహారెడ్డితో కూడా దాదాపు 77 కోట్లు కొల్లగొట్టాడు. దాంతో ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ వినూత్నంగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. టైటిల్ అనౌన్స్మెంట్కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 చోట్ల టైటిల్ హోర్డింగ్స్ పెట్టారు.
దానికి కారణం ఇది బాలయ్యకు 108వ సినిమా ( NBK108 )కావడమే.
ఈ సినిమాకు భగవత్ కేసరి ( Bhagavant Kesari ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్. ఇందులో బాలయ్య క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని.. సింపుల్‌గా చెప్పాలంటే సీతయ్యలా ఆయన క్యారెక్టర్‌ను అనిల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఉదయం 10:11 గంటలకు బాలయ్య ముహూర్తం పెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఫ్యాన్స్ చేతుల మీదుగానే భగవత్ కేసరి టీజర్ విడుదల కానుంది. తన బ్రాండ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా.. అలాగే బాలకృష్ణ అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఫుల్‌గా ఉండేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. టీజర్ చూడగానే సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేయాలని ఫిక్స్ అయిపోయాడు. దసరాకు ఈ సినిమా విడుదల వచ్చేస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు, రామ్ బోయపాటి సినిమా, విజయ్ లియో లాంటి సినిమాలు విజయదశమికి పోటీలో ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్న బాలయ్య సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం ప్రత్యేకం. రేపు టీజర్ సరిగ్గా పేలింది అంటే సినిమాపై అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోవడం ఖాయం.
Read More :
Varun Tej | రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్.. వైరల్‌గా మారిన మెగా ఫ్యాన్ పోస్ట్
Anupama Parameswaran | అనుపమ సూపర్ హాట్ షో.. రూట్ మార్చేసిన కేరళ కుట్టి.. ఈసారైనా కలిసొచ్చేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

