Filmfare Award | ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై నసీరుద్దీన్ షా వివాదాస్పద వ్యాఖ్యలు.. బాలీవుడ్ ప్రముఖల ఆగ్రహం
Film fare Award | బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, అవార్డును తన వాష్‌రూమ్ హ్యాండిల్‌పై వేలాడదీశానంటూ వ్యాఖ్యానించారు.
Film fare Award | బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, అవార్డును తన వాష్‌రూమ్ హ్యాండిల్‌పై వేలాడదీశానంటూ వ్యాఖ్యానించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.
ఈ క్రమంలో నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై అభిమానులతో పాటు సినీరంగానికి చెందిన ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయితో పాటు సుభాఘ్ ఘాయ్ సైతం నసీరుద్దీన్ షాపై విమర్శలు గుప్పించారు. మనోజ్ బాజ్‌పేయి స్పందిస్తూ ఫిల్మ్‌ఫేర్ తనకు ఎప్పుడూ ఒక కల లాంటిదని, తాను ఫిల్మ్‌ఫేర్ చూస్తూ పెరిగానని, దాన్ని చూసి ఆనందించానని తెలిపాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించడం, దాని ద్వారా వచ్చే హోదా అనుభవించడం ఓ గొప్ప సందర్భమని పేర్కొన్నారు.
సుభాష్ ఘాయ్ సైతం నసీరుద్దీన్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ఫేర్‌లో నామినేషన్‌కు ఎంపికవడం గర్వించదగ్గ విషయమని, అది ప్రతిష్టాత్మకమైన అవార్డు అని తెలిపారు. మనకు ఏ అవార్డు వచ్చినా, అది మన గౌరవార్థం ఇస్తున్నదేనని.. వాటిని అగౌరవపరచకూడదన్నారు. తాను అవార్డుకు చాలాసార్లు నామినేట్ అయ్యాయని, కానీ మూడుసార్లు మాత్రమే అందుకున్నానన్నారు. అందుకే ఇందులో నామినేషన్ సైతం గెలుపుతో సమానమన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

