NBK108 | ఎన్బీకే 108 నుంచి టైటిల్ కన్ఫార్మ్డ్.. ఇగ ఊచకోత షురూ..
NBK108 | రెండు మూడు రోజులుగా బాలయ్య ఫ్యాన్స్ మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట! అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాపై ఏ అప్డేట్ అయినా NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తోనే ఇచ్చారు.
NBK108 | రెండు మూడు రోజులుగా బాలయ్య ఫ్యాన్స్ మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట! అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాపై ఏ అప్డేట్ అయినా NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తోనే ఇచ్చారు. అయితే ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను జూన్ 8న లాంఛ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ సినిమా పేరుపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ వచ్చింది. భగవంత్ కేసరి, మోనార్క్ సహా పలు టైటిల్స్ పెట్టొచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ క్రమంలోనే సస్పెన్ష్‌కు చిత్ర బృందం తెరదించింది. సినిమా టైటిల్‌ను విడుదల చేసింది.
ఎన్బీకే 108 చిత్రానికి భగవంత్ కేసరి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. దీంతో పాటు బాలయ్య లుక్‌ను వదులుతూ చిత్ర బృందం ఒక ట్వీట్ చేసింది. దీనికి అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చేతిలో గొడ్డలితో పవర్ఫుల్ లుక్‌లో ఉన్న బాలయ్యను చూసి నిజంగానే బాక్సాఫీస్ ఊచకోత తప్పదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. టైటిల్ సరే టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని డైరెక్టర్ అనిల్ రావిపూడిని, చిత్ర యూనిట్‌ను ఫ్యాన్స్ అడుగుతున్నారు.
ఇప్పటివరకు రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్‌లో పవర్ఫుల్ పాత్రల్లో నటించిన బాలయ్య.. ఇప్పుడు రూట్ మార్చాడు. పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణను అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాలో బాలయ్య ఎలా ఉంటాడా? చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన సినిమా టైటిల్, బాలయ్య లుక్ ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. ఇక బాలయ్య స్నేహితుడిగా శరత్‌కుమార్ నటిస్తున్నాడు. సన్‌షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు బాక్సులు బద్ధలయ్యేలా బీజీఎం అందించిన థమన్ మరోసారి బాలయ్య కోసం అదిరిపోయే మాస్ బీట్స్ ఇస్తున్నాడు.
గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎
Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x
— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

