Anupama Parameswaran | అనుపమ సూపర్ హాట్ షో.. రూట్ మార్చేసిన కేరళ కుట్టి.. ఈసారైనా కలిసొచ్చేనా?
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకోండి.. అందం ఉంది.. అభినయం ఉంది.. అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది.. కానీ ఈమెకు అవకాశాలు మాత్రం రావట్లేదు. ఆమె కంటే తర్వాత వచ్చి అందాల ఆరబోతతో స్టార్ హీరోయిన్లు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు.
Anupama Parameswaran | ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు టాలెంట్ బోలెడు ఉంటుంది.. కానీ అదృష్టం మాత్రం ఆవగింజలో సగం కూడా ఉండదు. అందుకే వాళ్లకు హిట్స్ సూపర్ హిట్స్ ఎన్ని ఉన్నా అవకాశాలు మాత్రం రావు. దానికి కారణం గ్లామర్ షోకు దూరంగా ఉండటమే. కావాలంటే అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకోండి.. అందం ఉంది.. అభినయం ఉంది.. అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది.. కానీ ఈమెకు అవకాశాలు మాత్రం రావట్లేదు. ఆమె కంటే తర్వాత వచ్చి అందాల ఆరబోతతో స్టార్ హీరోయిన్లు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన అనుపమ.. ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో దారుణంగా విఫలమైంది. పైగా రంగస్థలం లాంటి కొన్ని సినిమాలు చేజేతులా వదిలేసుకోవడంతో ఈ అమ్మడు కెరీర్ అప్పుడే గాడి తప్పింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు డజన్ సినిమాలు చేసింది కానీ.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ కూడా కాదు. గ్లామర్ షో చేస్తున్నా.. ఈమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రావడం లేదు. దాంతో మరింత గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయిపోయింది అనుపమ. దానికి డీజే టిల్లు సీక్వెల్ నిదర్శనంగా నిలవనుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది.
రెండు రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది. దానికి కారణం సిద్దు కాదు.. అనుపమ అందాల ఆరబోత. కారులో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ ఫోటోలో కనిపిస్తున్న తీరును బట్టి అనుపమ సినిమాలో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత అనుపమ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు. మరోవైపు ఈ కేరళ కుట్టి కూడా అవకాశాల కోసం హాట్ షోతో పాటు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. మరి ఈ తెగింపు అనుపమ కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

