GOAT Movie | దళపతి విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించగా.. ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం ఇదే లాస్ట్ మూవీ అని ప్రచారం జరగడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఈ సినిమా చూడటం కోసం థియేటర్లకి పోటెత్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్గా మొదట నయనతారని అనుకున్నామని తెలిపాడు. అయితే నయన్ ఆ టైంలో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఇది సాధ్యపడలేదని తెలిపారు. దీంతో నయన్ ప్లేస్‌లో స్నేహని తీసుకున్నట్లు వెంకట్ ప్రభు వెల్లడించాడు. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం సినిమాను చూసి తనకు ఫోన్ చేసినట్లు స్నేహ తప్ప మరెవరూ ఆ క్యారెక్టర్‌ను అంత బాగా పోషించలేరని ప్రశంసించినట్టు వీపీ పేర్కొన్నాడు.
ఇక గోట్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించింది ఈ చిత్రం. కేవలం అడ్వాన్స్ రూపంలోనే హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.126 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో రజనీ కాంత్ తర్వాత తొలిరోజు వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్ మరోసారి రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కబాలి, రోబో 2తో పాటు లియో సినిమాల మీదా ఉంది. ప్రస్తుతం గోట్ చిత్రం రూ.288 కోట్ల వసూళ్లను సాధించి దూసుకుపోతుంది.
Also Read..