టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె లుక్ ఒకటి విడుదల చేస్తూ..శుభాకాంక్షలు తెలియజేశారు.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ ప్రాజెక్టులో నయనతార ఒరిజినల్ వెర్షన్లో మంజు వారియర్ పోషించిన పాత్రలో నటిస్తోంది. చిరంజీవితో నయనతార ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమా చేసింది నయనతారం. చిరుతో ఇది రెండో సినిమా కాగా..ఈ సారి చిరంజీవికి జోడిగా కాకుండా కీ రోల్లో కనిపించనుంది. మెడలో మల్టీకలర్ స్టోన్ చైన్‌తో చిరునవ్వులు చిందిస్తున్న నయన్ స్టిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ మూవీలో నయనతార యాక్టింగ్‌కు చాలా ప్రాధాన్యముండనున్నట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman).
Team #Godfather wishes Nayanthara a Very Happy Birthday!!
— BA Raju's Team (@baraju_SuperHit) November 18, 2021
MegaStar @Kchirutweets@jayam_mohanraja @alwaysramcharan #RBChoudary @ProducerNVP @KonidelaPRO @SuperGoodFilms_@MusicThaman @sureshsrajan pic.twitter.com/L0kA29UE3K
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫర్. మోహన్ రాజా ఒరిజినల్ వెర్షన్లో కంటే ఎక్కువగా చిరు మాస్ అవతార్‌ను చూపించబోతున్నాడని టాక్. చిరంజీవి దీంతోపాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayanthara | నయనతార విషయంలో అవన్నీ పుకార్లే
Nayanthara: నయనతార చెట్టుని పెళ్లి చేసుకోనుందా?
Nayanthara: షూటింగ్ గ్యాప్‌లో ప్రియుడితో దైవ దర్శనం చేసుకున్ననయనతార
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక