Nayanthara | దక్షిణాది క్యూట్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) – దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. ఈ జంటకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కాగా, ఈనెల 17న నయన్ తన పుట్టిన రోజును ఫ్యామిలీతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో బర్త్‌డేని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కన్నౌట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్ (Delhi restaurant)కు డిన్నర్ డేట్‌కు వెళ్లారు. అక్కడ దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడాల్సి వచ్చిందట (wait in line for 30 minutes). ఈ విషయాన్ని విఘ్నేశ్ శివన్ ఇన్‌స్టా వేదికగా తెలిపారు. అరగంట వెయిటింగ్ తర్వాత టేబుల్ దక్కినట్లు చెప్పుకొచ్చారు.
‘చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇద్దరం కలిసి డిన్నర్ చేయడం నిజంగా సంతోషంగా అనిపించింది. మేమిద్దరం దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డాం. ఆ తర్వాత ఓ మంచి సెంటర్ టేబుల్‌ను పొందాం. మా ఈ మధురమైన క్షణాల్ని వీడియో తీసిన వ్యక్తికి ధన్యవాదాలు’ అంటూ విఘ్నేశ్ శివన్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, అక్కడున్న వారు ఒక్కరు కూడా ఈ స్టార్ జంటవైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం.
Also Read..
Tamannaah | ఆ డిష్ తినకుండా లక్నోను విడిచి వెళ్లలేనంటోన్న తమన్నా
Nagarjuna | నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున
KCR Movie Review | ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా రివ్యూ