Naveen Polishetty | టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో కెరీర్‌కు బ్రేక్ రాగా, ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇటీవల అనుష్కతో చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కూడా మంచి విజయం సాధించడంతో ఆయన స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది.ఇప్పుడీ క్రమంలో తన నాలుగో సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే జరిగిన ప్రమాదం నవీన్ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది.
చేతికి, వెన్నెముకకు తీవ్ర గాయాలవడంతో దాదాపు ఏడాది పాటు షూటింగ్‌కు దూరమయ్యాడు. దీర్ఘ విరామం తరువాత ఈ సినిమాను పూర్తిచేసిన నవీన్ ఇప్పుడు సంక్రాంతి 2026 కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రమోషన్ కార్యక్రమంలో నవీన్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. నాది సైలెంట్ బ్యాచ్ కాదు.. అల్లరి చేసే బ్యాచ్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీ అందరి సపోర్ట్ వల్లే. ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి సినిమాలను మీరు ఎంత ప్రేమించారో తెలుసు. ఈ సినిమాను కూడా అదే ప్రేమతో ఆదరిస్తారని నమ్మకం ఉంది.
ప్రమాదం కారణంగా చేతికి, వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఏడాది పాటు బెడ్ రెస్టులోనే ఉన్నాను. మళ్లీ ఎంటర్టైన్ చేయగలనో లేదో అనుమానం వచ్చిందని, కానీ మీ ఆశీస్సులు నన్ను తిరిగి లేవబెట్టాయి. ఈ సినిమాలో పాట పాడాను, డ్యాన్స్ చేశాను… ఈ సారి పండగకి మీ ముందుకు రానున్నాను” అని అన్నారు. నవీన్ భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ‘అనగనగా ఒక రాజు’పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రమాదాన్ని జయించి, ప్రేక్షకుల ముందుకు వస్తున్న నవీన్ ప్రయాణం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.