Anaganaga Oka Raju | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నవీన్ పొలిశెట్టికి ప్రమాదం కారణంగా ఆలస్యమైంది. తాజాగా మేకర్స్ చాలా రోజులకు రిలీజ్ అప్డేట్ అందిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 26న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో నవీన్ పొలిశెట్టి లుంగీ, బనియన్ వేసుకుని, మెడలో రుమాలు వేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై వెళ్తుండటం చూడొచ్చు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ల పెళ్లా..?
రాజుగారి పెళ్లి విందులో చమ్మక్ చంద్ర అరేయ్ ఇది రాజుగారి పెళ్లి.. గెస్టులందరికీ గోల్డ్ ప్లేట్స్ మాత్రమే పెట్టండి.. అంటూ చెప్పే డైలాగ్స్‌తో మొదలైంది ప్రీ వెడ్డింగ్ వీడియో. అతిథుల్లో ఓ వ్యక్తి ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డ్.. స్వీటు గోల్డ్ అంటున్నారు.. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ల పెళ్లా అని అడుగుతుంటే.. మరో వ్యక్తి ఏవండి ఇది మా రాజుగారి పెళ్లండి అని అంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తూ.. ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి.. ముఖేశ్ మామయ్యా ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల ఫోన్ నంబర్లు పెట్టు చెబుతా.. ఈ ఇయర్ అంతా అంబానీ పెళ్లి.. వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి అంటున్నాడు. జాతి రత్నాలు హీరో స్టైల్ ఆఫ్ హ్యూమర్ టచ్‌తో సాగుతున్న వీడియో సినిమాపై అంచనాలు అమాంతం చేస్తోంది.
ఈ సంక్రాంతికి #AnaganagaOkaRaju తో దద్దరిల్లే నవ్వులు, ఆనందాన్ని తీస్కొతున్నాం ❤️❤️❤️
My Jaanejigars you are my family . నన్ను ఎప్పుడు మీలో ఒకరిగా చూసారు…mana families andari kosam ee cinema. We promise you a perfect entertainment blast for Sankranthi ❤️🙏😍
— Naveen Polishetty (@NaveenPolishety) May 26, 2025
ప్రీ వెడ్డింగ్ వీడియో..