Naveen Medaram | నందమూరి కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాతో అందరికీ హాయ్ చెప్పాడు డైరెక్టర్ నవీన్ మేడారం (Naveen Medaram). ఈ డైరెక్టర్ మరోవైపు సినిమాలు, వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తూ నిర్మాతగా కూడా బిజీ అయిపోయాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 90.. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌ను తెరకెక్కించగా.. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో ప్రీమియర్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
నవీన్ మేడారం ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ సారి చేస్తుంది మాత్రం సినిమా కాదు.. ఆహా వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు నవీన్ మేడారం. హోంటౌన్ (Home Town) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ కనకాల లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ వెబ్ ప్రాజెక్ట్ షూటింగ్ నేడు మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ లొకేషన్లో క్లిక్ మినిపించిన స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నవీన్ మేడారం.
స్పాట్లో రాజీవ్ కనకాల, నవీన్ మేడారం ఉన్న స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే వెబ్ సిరీస్‌పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. ఇంతకీ నవీన్ మేడారం ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడా..? నిర్మిస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది.
Read Also :
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Good Bad Ugly | అజిత్‌కుమార్‌తో సునీల్ సెల్ఫీ.. ఇంతకీ ఎక్కడున్నారో మరి..!
Amaran | అమరన్ నుంచి శివకార్తికేయన్-సాయిపల్లవి హే రంగులే లిరికల్ సాంగ్