Snakes & Ladders | అందాల రాక్షసి సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు నవీన్ చంద్ర (Naveen chandra). ఆ తర్వాత ఓ వైపు లీడ్ రోల్స్, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ కీ రోల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (Snakes & Ladders) . అశోక్ వీరప్పన్, భరత్ మురళీధన్, కమల ఆల్కెమిస్ దర్శకత్వం వహించారు.
వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తున్న తాను స్నేక్స్ అండ్ ల్యాడర్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చానన్నాడు. నలుగురు టీజేజ్ పిల్లల జీవితంలో జరిగిన అనూహ్య ఘటన నేపథ్యంలో వెబ్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. నలుగురు కొత్త పిల్లలతో వెబ్ సిరీస్‌ను మొత్తం కొడైకెనాల్లో షూటింగ్ చేశాం. ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందని అన్నాడు.
ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్, అమెజాన్ ప్రైమ్ సంయుక్త నిర్మాణంలో కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ తెరకెక్కించారు. అక్టోబర్ 18నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ట్రైలర్..
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?