ముంబై, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే తొలిసారిగా ముంబై కోస్టల్ రోడ్డులో కొంత భాగంపై ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ రోడ్ వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతుందో లేదో తెలియదు కానీ ఆ ప్రాంతం వారికి నిద్ర లేకుండా చేస్తున్నది.
వాహనాలు ఈ రోడ్‌పైకి రాగానే ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘జయహో’ పాట వినిపిస్తుంది. అయితే రోడ్డుకు ఇరువైపులా ఉన్న బ్రీచ్‌కాండీ స్థానిక నివాసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సంగీతం తమకు పెద్ద తలనొప్పిగా మారి నిద్ర కూడా రావడం లేదని వారు వాపోయారు. ఈ సంగీతం వలన ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తున్నదంటూ 650 మంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేశారు.