Show Time | టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో థ్రిల్లర్ మూవీతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. కామాక్షి భాస్కర్ల కథానాయికగా తెరకెక్కిన ‘ షో టైమ్ ‘ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 బ్యానర్‌పై ఈ షో టైమ్ సినిమా తెరకెక్కుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తోంది. ఓ కుటుంబం అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. ఓ పోలీసు అధికారి వారి ఇంటి డోర్ ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో తమకు ఎదురైన ఇబ్బంది నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. మొత్తానికి ఈ పోస్టర్ సినిమాపై ఉత్కంఠతను రేపుతోంది. నవీన్ చంద్ర గతంలో పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఆకట్టుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ థ్రిల్లర్ సినిమా కూడా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
షో టైమ్ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ శరత్ కుమార్ , సంభాషణలు శ్రీనివాస్ గవిరెడ్డి అందిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో కిశోర్ గరికపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.