71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజేతలు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్‌లాల్‌కు ప్రదానం చేశారు. ఉత్తమ నటుడిగా షారుఖ్‌ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్), ఉత్తమ నటి రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అవార్డులను స్వీకరించారు.
తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ‘భగవంత్‌కేసరి’ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికిగాను దర్శకుడు అనిల్‌రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అవార్డులను అందుకున్నారు. వీరితో పాటు తెలుగు నుంచి కాసర్ల శ్యామ్ (ఉత్తమ గేయ రచయిత-బలగం) సాయిరాజేష్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే-బేబీ), పీవీఎన్ఎస్ రోహిత్ (ఉత్తమ నేపథ్య గాయకుడు-బేబీ), ప్రశాంత్‌వర్మ (ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్-హనుమాన్), సుకృతివేణి (ఉత్తమ బాల నటి-గాంధీతాత చెట్టు) అవార్డులను అందుకున్నారు.
అనిల్‌రావిపూడి
కాసర్ల శ్యామ్
సుకృతివేణి
ప్రశాంత్‌వర్మ
సాయిరాజేష్
రాణీ ముఖర్జీ
విక్రాంత్ మస్సే
షారుఖ్‌ఖాన్