They Call Him OG | సాధారణంగా సినిమాలకు వాటి కంటెంట్, సన్నివేశాలను బట్టి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేస్తుందని తెలిసిందే. ప్రత్యేకించి అడల్ట్ కంటెంట్, హింసాత్మక దృశ్యాలున్న సినిమాలు ఏ రేటెడ్ కేటగిరిలోకి వస్తాయి. ఈ సినిమాలు చూసేందుకు చిన్నారులను అనుమతించరు.
ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. కాగా ఇందులో చిన్నారులపై ప్రభావం చూపించే హింసాత్మక సన్నివేశాలున్నాయని తెలిసిందే. నర్సాపూర్‌కు చెందిన బాలుడు రితిక్ తన తల్లిదండ్రులతో కలిసి రెండు రోజుల క్రితం ఓజీ చూసేందుకు హైదరాబాద్‌లోని జీఎస్ఎం థియేటర్‌కు వెళ్లాడు. అయితే ఓజీ ఏ రేటెడ్ మూవీ కావడంతో థియేటర్ వాళ్లు రితిక్‌ను లోపలికి అనుమతించలేదు. దీంతో తన ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్ సినిమా చూడలేకపోయానంటూ తన ఆవేదనను ఓ వీడియో ద్వారా షేర్ చేశాడు రితిక్.
హలో ఫ్రెండ్స్ నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్.. మా నాన్న కూడా పవన్ కల్యాణ్ అభిమాని. పవన్ కల్యాణ్ ఏ సినిమా వచ్చినా మేం ఫస్ట్ డేనే వెళ్తాం. ఓజీ సినిమా వచ్చిందని మేం 2-3 గంటలు కష్టపడి 4 టికెట్లు రూ.2వేలు పెట్టి బుక్ చేసుకున్నం. మేం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళితే ఇది ఏ (A-rated)సర్టిఫికెట్ మూవీ అని నన్ను ఆపేశారు. మరి కొన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తే మమ్మల్ని సినిమా చూడకుండా ఎలా ఆపుతారు. పవన్ కల్యాణ్ గారు అందరూ చూసేలాగా మంచి సినిమాలు తీయండి.. మీకైతే చిన్నాపెద్దా అందరూ అభిమానులుండొచ్చు.. అంటూ రితిక్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Lokah Chapter 2 | చాప్టర్ 1 బ్లాక్ బస్టర్.. ‘లోక చాప్టర్’ 2ని అనౌన్స్ చేసిన మేకర్స్
Little Hearts | ఓటీటీలోకి ‘లిటిల్ హార్ట్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!