Little Hearts | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి మార్తండ్ దర్శకత్వం వహించగా.. ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్హిట్ను అందుకుంది. తాజాగా ఈ చిత్రం (Little Hearts OTT) ఓటీటీ వేదిక ఈటీవీ విన్ వేదికగా అక్టోబర్ 01 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది.
The blockbuster rom-com of the year coming to your home…💖
This time longer, sweeter & crazier!💞
Little Hearts (Extended Cut 🤩)
A WIN Original ProductionStreaming from Oct 1 only on @etvwin @marthandsai #AdityaHasan @mouli_talks @shivani_nagaram @TheBunnyVas… pic.twitter.com/zc12LfIhQl
— ETV Win (@etvwin) September 26, 2025