Anupama Parameswaran | అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీల ‘కిష్కింధకాండ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనుపమ, ఓ విలేఖరి వ్యాఖ్యపై ఘాటుగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె రియాక్షన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఓ విలేఖరి అనుపమను ఉద్దేశించి, మీరు ‘టిల్లు స్క్వేర్’ లాంటి సినిమాల్లో నటించడం జీర్ణించుకోలేకపోయాం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
ఇది విన్న అనుపమ ఒక్కసారిగా సీరియస్ అయ్యి, తీవ్ర అసహనంతో స్పందిస్తూ .. “మీరు టిల్లు స్క్వేర్ చూసి డైజెస్ట్ కాలేదంటారు… కానీ నేను ‘పరదా’ అనే మంచి ఫీల్ గుడ్ సినిమా చేశాను. అది మీరు చూశారా? లేదుగా! ఎందుకంటే మంచి సినిమాలు చూసేందుకు మీరు ముందుకు రారు. అలాంటి సినిమాల గురించి ఎవ్వరూ మాట్లాడరు కూడా. కానీ ఒక హాట్ టాపిక్ ఉంటే మాత్రం ఏదో ఒక కామెంట్ చేయడానికి ముందు వరుసలో ఉండిపోతారు అని అనుపమ అనడంతో విలేఖరి కాస్త అవాక్కయ్యాడు. మిగతా మీడియా ప్రతినిధులంతా కూడా కాసేపు సైలెంట్ అయ్యారు. తర్వాత అనుపమ మళ్లీ నవ్వుతూ మాట్లాడింది.
అనుపమ ఇచ్చిన సమాధానానికి అభిమానుల నుంచి మాత్రం మంచి స్పందన అందుకుంది. అనుపమ నటించిన తాజా హారర్-థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధకాండ’ ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా, అనుపమకు నటిగా కొత్త ఊపును ఇచ్చిందనే చెప్పాలి. ఆమె పాత్రలోని పరిణతి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అనుపమ గత కొంతకాలంగా కమర్షియల్ పాత్రలతో పాటు, వైవిధ్యమైన కంటెంట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ‘పరదా’ వంటి హృద్యమైన సినిమాలు చేసినా, అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. కాగా, ఇదే సమయంలో ఓ స్టార్ హీరో ఇలా చేసి ఉంటే అదే వాళ్ల రొమాంటిక్ యాటిట్యూడ్ అంటారు, కానీ అమ్మాయిలపై మాత్రం ప్రశ్నల దాడి ఎందుకు?” అనే డిస్కషన్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.