Kotha Lokah Movie | మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘లోక చాప్టర్ 1చంద్ర’ (తెలుగులో కొత్త లోక). గత నెల 28న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్లో నటించగా.. నెస్లన్, చందు, సాయికుమార్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించారు. డొమెనిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ ‘వే ఫేరర్ ఫిల్మ్స్’ నిర్మించింది. అయితే ఈ సినిమాకు తాజాగా చాప్టర్ 2ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో దుల్కర్‌తో పాటు టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. సెకండ్ చాప్టర్‌కి కూడా డొమెనిక్ అరుణ్ దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా చాప్టర్ 2 కి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను చిత్రబృందం వదిలింది. లోకలో మొత్తం ఐదు సినిమాలు రాబోతున్నట్లు సమాచారం.
Beyond myths. Beyond legends. A new chapter begins. #LokahChapter2https://t.co/gYmtLIP4Qh#Lokah #TheyLiveAmongUs @ttovino @dulQuer @DQsWayfarerFilm #DominicArun pic.twitter.com/6CwjtPPpH6
— Mammootty (@mammukka) September 27, 2025