సీనియర్ నటుడు నరేష్, తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేం అఖిల్ ఉడ్డెమారి ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకుడు. బూసమ్ జగన్మోహన్రెడ్డి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. సీనియర్ నటుడు నరేష్ ఇందులో ‘పర్వతాలు’ అనే పాత్ర పోషిస్తున్నారు.
మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శభాకాంక్షలు తెలుపుతూ, తాను పోషిస్తున్న ‘పర్వతాలు’ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో జోష్‌గా మూవ్ అవుతున్న నరేష్‌ను ఈ పోస్టర్లో చూడొచ్చు. పెళ్లి నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ఇదని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాణం: యారో సినిమాస్.