రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్ధన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకుడు. డా॥ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. నవంబర్ 3న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను యువ హీరో నాగశౌర్య విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ప్రతీ సీన్ కొత్తగా అనిపిస్తుంది. నా చిన్నతనంలో చూసిన ఓ సంఘటన ఆధారంగా కథ రాసుకున్నా. కథలో ట్రాన్స్‌జెండర్ అంశం ఆసక్తికరంగా ఉంటుంది. వినోదంతో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, వారిని సర్ప్రైజ్ చేసే అంశాలెన్నో ఉంటాయని హీరో రక్షిత్ అట్లూరి చెప్పారు. వినూత్నమైన కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: ఏఐఎస్ నాఫాల్ రాజా, నిర్మాణ సంస్థ: సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్.