కొంత విరామం తరువాత నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2’. మూర్తి దేవగుప్తపు దర్శకుడు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇది ‘ప్రతినిధి’ సిరీస్ నుండి వస్తున్న రెండో ఫ్రాంచైజీ కానుందని, పొలిటికల్ థ్రిల్లర్‌గా గ్రిప్పింగ్ కథనంతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో చిత్రం వుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్.